ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు


69వ గణతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్‌పథ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకకు విశిష్ట అతిథులుగా పది ఏషియన్ దేశాల అధినేతలు హాజరయ్యారు. వారికి ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. రాజ్‌పథ్‌లో ఆర్మీ పరేడ్‌తో పాటు భారత సైనిక పాటవం ఆకట్టుకుంటోంది. అంతకు ముందు అమర్‌జవాన్ జ్యోతి వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు ఆర్పించారు. వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.