TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నాగార్జున ఎన్ కన్వెన్షన్‌లో కబ్జా భూమి!

Published on: Sat Jun 28, 2014 4:03PM

 

నటుడు అక్కినేని నాగార్జున నిర్మించిన ఫంక్షన్ హాల్ ‘ఎన్’ కన్వెన్షన్‌ పరిసరాలను రెవెన్యూ అధికారులు సర్వే నిపుణుల చేత సర్వే చేయించారు. దాదాపు ఎకరం తుమ్మిడికుంట చెరువు స్థలాన్ని, రెండు ఎకరాలు బఫర్ ఏరియాని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్‌ని నిర్మించారని సర్వే సిబ్బంది ప్రాథమికంగా తేల్చారు. ఎన్ కన్వెన్షన్‌ హాల్, వంటగదులను చెరువు స్థలంలోనే నిర్మించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావలసి వుంది.