13న తెలంగాణ, సీమాంధ్రలో రీపోలింగ్‌

 

 

 

ఈ నెల 13న రాష్ట్రంలో 29 పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 13 లోక్‌ సభ, 21 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని 29 కేంద్రాల్లో రీపోలిగ్‌ నిర్వహిచనున్నట్లు తెలిపారు. దీంతో 13న ఆయా కేంద్రాల్లో రీపోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. తెలంగాణలో మొత్తం 12 కేంద్రాల్లో, సీమాంధ్రలో మొత్తం 17 కేంద్రాల్లో రీపోలింగ్ జరగనుంది.

 

తెలంగాణలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు

పార్లమెంటు: నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని బోధన్‌లో 64వ పోలింగ్ కేంద్రం, జహీరాబాద్ లోక్‌సభ పరిధిలోని జుక్కల్‌లో 134వ పోలింగ్ కేంద్రం, బాన్సువాడలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు. నిజామాబాద్ రూరల్‌లోని 9వ నెంబర్ పోలింగ్ కేంద్రం, కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని హుస్నాబాద్‌లో 170వ పోలింగ్ కేంద్రం.

అసెంబ్లీ: బాన్సువాడలో 146వ పోలింగ్ కేంద్రం, నిజామాబాద్ రూరల్‌లోని 48, 168 పోలింగ్ కేంద్రాలు, కూకట్‌పల్లిలోని 371/ఎ పోలింగ్ కేంద్రం, కొత్తగూడెంలో 161 పోలింగ్ కేంద్రం, భద్రాచలంలో 239 పోలింగ్ కేంద్రం.

సీమాంధ్రలో రీపోలింగ్ జరిగే కేంద్రాలు

పార్లమెంటు: శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలోని శ్రీకాకుళంలో46వ పోలింగ్ కేంద్రం, మచిలీపట్నం లోక్‌సభ పరిధిలోని గుడివాడలో 123వ కేంద్రం, అవనిగడ్డలోని 29వ కేంద్రం, విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ తూర్పులో 212 వ పోలింగ్ కేంద్రం, మైలవరంలో 123 పోలింగ్ కేంద్రం, జగ్గయ్యపేటలోని 122వ పోలింగ్ కేంద్రం.

అసెంబ్లీ: కుప్పంలోని 192 పోలింగ్ కేంద్రం, సాలూరులోని 134వ పోలింగ్ కేంద్రం, అవనిగడ్డలోని 91వ పోలింగ్ కేంద్రం, పెనమలూరులోని 59, 172 పోలింగ్ కేంద్రాలు, నందిగామలో 171, 174 పోలింగ్ కేంద్రాలు.

పార్లమెంట్, అసెంబ్లీ: అరకు లోక్‌సభ పరిధిలోని పాడేరులో 68వ పోలింగ్ కేంద్రం, కడప లోక్‌సభ పరిధిలోని జమ్మలమడుగులో 80, 81,82 పోలింగ్ కేంద్రాలు. (ఇక్కడ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు రెండిటికీ రీపోలింగ్ జరగనుంది)