శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు మరమ్మతులు
Published on: Fri Feb 21, 2025 3:06PM

తిరుమల శ్రీవారి ఆలయంలో మరమ్మతు పనులు చేపట్టారు. లీకేజీల నివారణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆదేశాల మేరకు మరమ్మతు పనులు మొదలయ్యాయి. గతేడాది నవంబరు 18వ తేదీన జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఈ సమస్యపై చర్చించి మరమ్మతులు చేపట్టాలని తీర్మానించారు.
లీకేజీల నివారణ అంశంలో అనుభవం కలిగిన టీవీఎస్ సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ పనులన్నీ ఉచితగా చేసేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా ఆ సంస్థకు చెందిన సిబ్బంది లీకేజీ నివారణ పనులు ప్రారంభించారు. ప్రస్తుతం పగుళ్లను గుర్తించి పూడ్చడంతో పాటు పెయింటింగ్ వేస్తున్నారు


