TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సర్కార్ పై రేణుకాస్త్రం.. అమరావతి రణం

Published on: Tue Nov 2, 2021 8:22AM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి పరిచయం అక్కరలేదు.హైద్రబాద్ మున్సిపల్ కొర్పొరేషన్’లో  తెలుగు దేశం పార్టీ కార్పొరేటర్’గా రాజకీయ అరంగేట్రం చేసిన రేణుకా చౌదరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. అన్నిటినీ మించి ఆమె, ఫైర్ బ్రాండ్ ఇమేజ్, జాతీయ స్థాయిలోనూ ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టింది. ప్రధానమంత్రి నరేందర్ మోడీనే  పెద్దల సభలో ఢీ’కొన్న రేణుకా చౌదరి, ఈ మధ్య కాలంలో     వార్తల్లో అంతగా కనిపించడం లేదు. కారణాలు ఏవైనా ఆమె కొంత సైలెంట్ గా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ కార్యకలాపాల్లో జోష్ పెరిగినా, రేణుకా చౌదరి మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు.  
అయితే, ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఏపీలో, సుదీర్ఘ కాలంగా, సాగుతున్న రాజధాని రైతుల ఆందోళనకు, అమరావతి మహిళలు చేపట్టిన మహాపాదయాత్రకు మద్దతుగా రంగంలోకి దిగారు. ఈసంధర్భంగా ఆమె మరో మారు, తమ బ్రాండ్ ఇమేజ్’కి తగ్గట్టుగా, వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రైతులు దేశానికి వెన్నెముక అని.. అలాంటి వారిని వైసీపీ ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందని విమ‌ర్శించారు మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలు అని జగన్ సర్కార్‌ను హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల‌ని రైతులు రోడ్డెక్కే పరిస్థితులు కల్పించిన జ‌గ‌న్’ను ఇంటికే ప‌రిమితం చేయాల‌ని పిలుపునిచ్చారు. 

ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి, తాను సైనికుడి కూతురిని... దేశంలో ఎక్కడైనా పర్యటిస్తానని అన్నారు. మహిళలు ఓటుతో జగన్ సర్కారుకు బుద్ధి చెబుతారని రేణుక జోస్యం చెప్పారు.అదలా ఉంటే, ఇంతకాలం కొంత మౌనంగా ఉన్న రేణుక చౌదరి, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్’ లో ప్రత్యక్షం కావడం విషయంలో రాజకీయ వర్గాల్లో కొంత చర్చ జరుగుతోంది. అయితే,ఖమ్మం జిల్లా, తెలంగాణలో ఉన్నా ఏపీ రాజకీయాల ప్రభావం కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. అందుకే ఆమె వ్యూహత్మకంగానే అమరావతి మహిళల ఆందోళనకు మద్దతు తెలిపారని అంటున్నారు.