కేసీఆర్ కు రేణుకా సవాల్..
Published on: Thu Jan 14, 2016 2:52PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి అధికార పార్టీ టీఆర్ఎస్ పై మండిపడ్డారు. భాగ్యనగరంలోని సెటిలర్స్కు మీరు ఇచ్చేది ఏమిటి.. వారికి రాజ్యాంగమే రక్షణ కల్పిస్తుందని.. సీమాంధ్రుల పైన ప్రేమకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే కారణమని చెప్పారు. అధికార పార్టీ మాటలు చెప్పడం కాదు ధైర్యం ఉంటే కేసీఆర్ పార్టీ మారిన వారితో రాజీనామా చేయించి.. అప్పుడు తిరిగి మళ్లీ పోటీ చేయించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీవి మాటలు కాదని, చేతలు అన్నారు.


