TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'క‌మ్మ‌'రావ‌తి.. కులం పేరెత్తితే చెప్పుదెబ్బ‌.. త‌గ్గేదేలే.. తిర‌గ‌బ‌డితే పీకేదేమీలే!

Published on: Sat Apr 16, 2022 4:13PM

ప‌డ్డారు. ఇన్నాళ్లూ ప‌డ్డారు. నోరూముసుకొని భరించారు. అవమానాలు సహించారు. ఇక ప‌డేదేలే. తగ్గేదేలే. గ‌దిలో పిల్లిని బంధించి కొడితే తిర‌గ‌బ‌డిన‌ట్టు తిర‌గ‌బ‌డుతున్నారు చిన్నాపెద్దా. క‌మ్మ-క‌మ్మ అంటూ ఇన్నాళ్లూ వేసిన బండ‌ల‌న్నీ పోగేసి.. అదే రాళ్లతో ఎదురుదాడికి తెగ‌బ‌డుతున్నారు కొంద‌రు క‌మ్మ వ‌ర్గీయులు. మిగ‌తా క‌మ్మ వ‌ర్గానికి స్పూర్తిగా, ఆద‌ర్శంగా నిలుస్తున్నారు. పోరాడితే పోయేదేమీలే.. తిరిగి తిడితే పీకేదేమీలే.. అనేలా క‌మ్మ కుల‌స్తులు మ‌ర్యాద‌, గౌర‌వం కోసం ఆత్మ‌భిమాన పోరాటానికి ముందుకొస్తున్నారు. అందులో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి అంద‌రికంటే ముందుంటే.. సినీ నిర్మాత‌, న‌టుడు బండ్ల గ‌ణేష్ ఒక్క‌సారిగా ట్విట‌ర్ స్క్రీన్‌పై చెల‌రేగిపోయారు. మిగ‌తా క‌మ్మ‌ల్లోనూ క‌ద‌నోత్సాహం ర‌గిలిస్తున్నారు.

క‌మ్మ క‌మ్మ అంటున్నారుగా.. ద‌మ్ముంటే అమ‌రావ‌తికి క‌మ్మ‌రావ‌తి అని పేరు పెట్టండి చూద్దాం.. అంటూ ఫైర్ బ్రాండ్ లీడ‌ర్‌ రేణుకా చౌద‌రి నేరుగా సీఎం జ‌గ‌న్‌కు స‌వాల్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ రేంజ్‌లో, ఇలా నేరుగా జ‌గ‌న్‌పై అటాక్ చేసిన వారెవ‌రూ లేక‌పోవ‌డంతో రేణుకా వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ఇప్పుడే కాదు.. గ‌తంలోనూ ఇంత‌కంటే హాట్ హాట్ కామెంట్స్ చేశారు రేణుకా చౌద‌రి. ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిపై న‌లుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అసంబద్ధ వ్యాఖ్య‌లు చేయ‌డం, సీఎం జ‌గ‌న్ సైతం వారిని క‌వ‌ర్ చేసేలా కామెంట్లు చేయ‌డంపైనా రేణుక ఇంత‌కంటే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. `చెప్పుతో కొడదా బద్మాష్` అంటూ ఫైరయ్యారు. తెలంగాణ నాయ‌కురాలైన రేణుకా చౌద‌రి.. త‌న‌ రాష్ట్రం కాక‌పోయినా.. త‌న పార్టీ కాక‌పోయినా.. క‌మ్మ వ‌ర్గంపై ఇలా వ‌రుస‌బెట్టి మాట‌ల దాడులు చేస్తుండ‌టం.. క‌మ్మ కులాన్ని సాకుగా చూపించి అమ‌రావ‌తిని భ్ర‌ష్టుప‌ట్టించ‌డం, రైతుల‌ను కేసుల‌తో వేధించ‌డంపై మొద‌టి నుంచీ మండిప‌డుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా.. ద‌మ్ముంటే క‌మ్మ‌రావ‌తి అని పేరుపెట్టాలంటూ డైరెక్ట్‌గా జ‌గ‌న్‌కే ఛాలెంజ్ చేసి.. వైసీపీని డిఫెన్స్‌లో ప‌డేశార‌ని అంటున్నారు. 

రేణుకా చౌద‌రి వ్య‌వ‌హారంతో అస‌లేమాత్రం సంబంధం లేకున్నా.. అదే రోజు సినీ రంగానికి చెందిన బండ్ల గ‌ణేశ్ సైతం.. యాదృచ్చికంగా క‌మ్మ కులంపై చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోలేక విజ‌య‌సాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ ట్విట‌ర్‌లో చీల్చి చెండాడ‌టం తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. విష సాయి అంటూ.. క‌మ్మ కులంపై విషం చిమ్మ‌డం ఏంటంటూ.. సాయిరెడ్డికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు బండ్ల గ‌ణేశ్. ఓ వ్యక్తి మీద కోపంతో కులం మొత్తాన్ని తిడితే ప్రజలు నీకు చెప్పుదెబ్బ రుచి చూపిస్తారంటూ విజయసాయికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కులాల‌పై చాలా ప‌ద్ద‌తిగా విజ‌య‌సాయికి అర్థ‌మ‌య్యే భాష‌లో వివ‌రించి చెప్పారు. కాక‌పోతే కాస్త ఘాటుగా, గిల్లి మ‌రీ చెప్ప‌డం బండ్ల‌కే చెల్లింది. అయితే, బండ్ల గ‌ణేశ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అభిమానే కానీ ఈ ట్వీట్ల వ‌ర్షం వెనుక జ‌న‌సేన లేక‌పోవ‌చ్చు.. క‌మ్మ కులాన్ని టార్గెట్ చేసుకుని విజ‌య‌సాయిరెడ్డి ప‌దే ప‌దే విమ‌ర్శ‌లు చేయ‌డాన్ని త‌ట్టుకోలేక‌.. ఏపీ రాజ‌కీయ విష‌యాల‌తో బండ్ల‌కు అస‌లేమాత్రం సంబంధం లేకున్నా.. ఇలా ట్వీట్లు చేస్తే త‌న‌ను టార్గెట్ చేస్తార‌ని తెలిసే.. త‌ట్టుకోలేక‌, కులాన్ని నిందించ‌డం స‌హించ‌లేక‌.. ఏమైతే అదే అయింది తేల్చుకుందాం అనుకొని మ‌రీ.. ఇలా ట్విట‌ర్‌లో సాయిరెడ్డిని తూట్లు పొడిచారు బండ్ల గ‌ణేశ్‌. 

లేక‌పోతే ఏంటి.. చంద్ర‌బాబు అనే నాయ‌కుడు క‌మ్మ కుల‌స్తుడు అయినందున‌.. అమ‌రావ‌తి నుంచి కోవాగ్జిన్ వ‌ర‌కూ.. ఏబీవీ నుంచి నిమ్మ‌గ‌డ్డ వ‌ర‌కు.. ఎవ‌రిని ప‌డితే వారిని, దేన్నిప‌డితే దాన్ని.. క‌మ్మ కులంతో లింకు పెట్టి.. రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుపోకాడిని విచ్చ‌ల‌విడిగా క‌మ్మ కులంపై దూష‌ణ‌లు, తిట్లు, పిచ్చి పైత్యం ప్ర‌ద‌ర్శిస్తే.. గ‌దిలో బంధించిన పిల్లులే పులులై తిర‌గ‌బ‌డిన‌ట్టు.. ఒక రేణుకా చౌద‌రి, ఒక బండ్ల గ‌ణేశ్ లాంటి వాళ్లు ఎదురుదాడికి దిగార‌ని అంటున్నారు. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని.. ఇప్ప‌టికైనా తీరు మార్చుకోక‌పోతే.. అత్యంత బ‌ల‌మైన క‌మ్మ వ‌ర్గం నుంచి మ‌రింత తీవ్ర‌మైన ప్ర‌తిఘ‌ట‌న ఎదురుకాక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఎనీ డౌట్స్ జ‌గ‌న్‌రెడ్డి?.. అంటున్నారు.