వైరల్ గా మారిన చైనా యాప్ ల తొలగింపు


భారత చైనాల మధ్య ఒక పక్క బోర్డర్ వద్ద నెలకొన్న ఘర్షణ, మరో పక్క చైనా దన్నుతో మన దేశం పై నేపాల్ రెచ్చిపోతున్నసమయంలో.. అసలు మనం చైనాను ఎందుకు ప్రోత్సహించాలి అనే ఆలోచన మన దేశ యువత లో మొదలైంది. దాని పర్యవసానంగానే గూగుల్ ప్లే స్టోర్ లో కొత్తగా వచ్చిన ఒక యాప్ ను యూజర్లు గత రెండు వారాలుగా మిలియన్ల్ సంఖ్యలో డౌన్ లోడ్ చేసుకున్నారు. యాండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడే భారత దేశ యువతరం లో "రిమూవ్ చైనా యాప్స్" అనే ఈ కొత్త యాప్ వైరల్ గా మారింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్ లోని ఫ్రీ యాప్ ల లో నంబర్ టూ ప్లేస్ సాధించింది. ఇంతకు ఈ యాప్ ఏం చేస్తుందంటే మన మొబైల్ లోని చైనా యాప్ ల గురించిన సమాచారం ఇస్తుంది. ఒక్క సారి డౌన్ లోడ్ చేస్కుని ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత స్కాన్ చేస్తే చైనా కంపినీల నుండి వచ్చిన యాప్ లను ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తికి చైనా నిర్లక్ష్యమే కారణమని అమెరికా తో సహా ప్రపంచ దేశాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి యాప్ లు చైనా ను మరింతగా దెబ్బ తీసే అవకాశం ఉంది.