TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా.. జీవిత ఖైదీల విడుదల

Published on: Tue Jun 2, 2026 12:45PM

 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం (జూన్ 2) రాష్ట్ర వ్యాప్తంగా సత్ప్ర వర్తన కలిగిన జీవిత ఖైదీల విడుదల కార్యక్రమం జరుగనుంది. దీర్ఘకాలంగా జైలు శిక్ష అనుభవిస్తూ, జైలులో సత్ప్రవర్తన ప్రదర్శించిన ఖైదీల విడుదలకు  ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో ఉన్న మొత్తం 91 మంది జీవిత ఖైదీలను విడుదల చేయనున్నట్లు జైలు శాఖ అధికారులు వెల్లడించారు.

జైలు శాఖ నిబంధనల ప్రకారం..  శిక్ష కాలంలో ఖైదీల ప్రవర్తన, క్రమశిక్షణ, పునరా వాస కార్యక్రమాల్లో పాల్గొన డం వంటి అంశాలను పరిశీలించి అర్హులను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియ పూర్తైన తరువాత విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను అధికారులు ఖరారు చేశారు. 

ఈ క్రమం లోనే ఈ మంగళవారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీల విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు.  ఇందుకు చర్లపల్లి జైలువద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విడుదల సందర్భంగా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు, జైలు సిబ్బంది పర్యవేక్షణలో ఖైదీల విడు దల ప్రక్రియ కొనసాగనుంది.

విడుదలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు స్వాగతించేందుకు జైలుకు చేరుకునే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల తర్వాత స్వేచ్ఛా జీవితం లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో జైలు వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ విడుదల కార్యక్రమం జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించు కుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంలో పునరావాసం, రెండో అవకాశం అనే సందేశాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు.