TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రీజెన్సీ సెరామిక్స్ వ్యవస్థాపకుడు కన్నుమూత

Published on: Thu Apr 30, 2026 9:53AM

ప్రముఖ పారిశ్రామికవేత్త, రీజెన్సీ సెరామిక్  వ్యవస్థాపకుడు  జీఎన్ నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో చికిత్స పొందుతూ బుధవారం (ఏప్రిల్ 29) తుదిశ్వాస విడిచారు. 1983లో రీజెన్సీ సెరామిక్స్‌ను స్థాపించిన జి.ఎన్. నాయుడు, దేశ సెరామిక్స్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన సంస్థను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన మరణవార్త తెలిసి పరిశ్రమ వర్గాలు, సన్నిహి తులు, ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జి.ఎన్. నాయుడు మరణంతో పరిశ్రమలో ఒక శూన్యం ఏర్పడిందని అంటున్నారు.. అతనికి పలువురు నివాళులు అర్పిస్తున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు జీఎన్ నాయుడి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  జీఎన్ నాయుడు మరణం పారిశ్రామిక రంగానికి తీరని లోటన్నారు. యానాంలో సిరామిక్స్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా ఎందరికో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని పేర్కొన్నారు.  జీఎన్ నాయుడు కుటుంబ సభ్యులకు  చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.