TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలుడి ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం

Published on: Tue Apr 21, 2026 5:31PM

 

సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఆశతో చాలా మంది యువత ప్రమాదకర రీల్స్ చేస్తూ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అలాంటి విషాదకర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడు తన స్నేహితుల మాదిరిగా రీల్స్ చేసి గుర్తింపు పొందాలని ఆశపడ్డాడు. కానీ అదే ఆలోచన చివరకు అతని ప్రాణాన్ని బలి తీసుకుంది. 

నగరంలోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలోని ఓ బస్తీలో నివసిస్తున్న మితున్ (14) సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో ఫేమస్ కావాలని ఆశపడ్డాడు.ఈ నెల 5వ తేదీన తన స్నేహితులతో కలిసి ఓ భవనం పైకెక్కిన మితున్, బాల్కనీ రైలింగ్ పిట్టగోడపై రిస్కీ ఫీట్స్ చేస్తుండగా అనుకోకుండా కాలుజారి కిందపడిపోయాడు. భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు బయటికి పరుగులు తీసి చూడగా, బాలుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు.

తక్షణమే కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో మితున్‌ను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మితున్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.ఈ దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మితున్ మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతదేహాన్ని అతని స్వస్థలమైన బీహార్‌కు తరలిస్తున్నారు.