TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా సెక్యూరిటీ తగ్గించండి.. ఎస్పీజీకి మోడీ ఆదేశాలు

Published on: Wed May 13, 2026 9:26AM

పొదుపు పాటించండి అంటూ ప్రజలకు పిలుపు ఇచ్చిన మోడీ అక్కడితో ఆగకుండా, అందుకు తానే స్వయంగా శ్రీకారం చుట్టారు.   ఇటీవలి తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభలో పొదుపుపై కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోడీ  తానే స్వయంగా పాటించేందుకు సిద్ధమయ్యారు. తన కాన్వాయ్‌ సైజ్‌ను సగానికి తగ్గించాలని ప్రధాని మోడీ ఎస్‌పీజీకి ఆదేశాలు జారీ చేశారు.  

పొదుపు మంత్రం పాటించాలని ప్రజలకు సూచించిన ప్రధాని మోదీ ముందుగా పొదుపు పాటించడాన్ని తన నుంచే ఆరంభించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే  తన కాన్వాయ్‌ను సగానికి తగ్గించాలని ఆదేశించారు. అదే సమయంలో తప్పనిసరి భద్రతా నిబంధనలకు  భంగం కలగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రధాని సూచనల మేరకు  ఎస్‌పీజీ  చర్యలకు ఉపక్రమించింది. ప్రధాని చెప్పినట్లుగా ఆయన కాన్వాయ్ లో లక్ట్రిక్‌ వాహనాలను వినియోగించేందుకు సమాయత్తమౌతోంది.