TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజ్యాంగాన్ని కాపాడేందుకే పోటీ చేస్తున్న : జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

Published on: Mon Sep 1, 2025 3:20PM

 

ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి  ఆయన ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తనకు ఏపార్టీలో సభ్యత్వం లేదని తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకే తాను ఉపరాష్ట్రపతిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. పౌరహక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడుతానని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతు కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని తెలిపారు.

ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు అంత్యంత ప్రాధాన్యత ఉంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ల్లు రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీయే అభ్యర్థిని పెట్టిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని బరిలోకి దింపింది. ఎన్నికలు, రాజకీయాలు, వివాదాలపై ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ.. తెలుగువాడికి ఇప్పుడొక అవకాశం వచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మాజీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌, ఎంఐఎం అధ్యక్షుడు అక్బరుద్దీన్‌ ఒవైసీలకు విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి సుదర్శన్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలి’’అని రేవంత్‌రెడ్డి తెలిపారు