TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రచందనం స్మగ్లర్.. వైసీపీ ఎంపీపీ బాబుల్‌రెడ్డి అరెస్టు

Published on: Wed Jul 31, 2024 11:54AM

అన్నమయ్య జిల్లా పుల్లంపేటకు చెందినవైసీపీ నేత బాబుల్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో పుల్లంపేట ఎంపీపీగా ఉన్న బాబుల్ రెడ్డిని అరెస్టు చేసి చాపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గతంలో అనేక సార్లు ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన బాబుల్ రెడ్డి వైసీపీ హయాంలో మాత్రం స్వేచ్ఛగా బయట తిరిగాడు. గతంలో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడిగా ఉన్న బాబుల్ రెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఈయన పుల్లంపేటకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డికి సమీప బంధువు. గత ఐదేళ్లు భారీగా ఎర్రచందనాన్ని ఇతర ప్రాంతాలకు తరలించినట్లు బాబుల్ రెడ్డిపైన ఆరోపణలు ఉన్నాయి.