TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష... రూ.6 లక్షల జరిమానా

Published on: Wed Aug 20, 2025 3:52PM

 

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ముగ్గురు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పు నిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ   పీ. శ్రీనివాస్  పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. 

పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 72/2017 కేసులో ఈ  ముద్దాయిలు తిరుపతి జిల్లా నాగపట్ల ఈస్ట్ బీట్ చామల రేంజి పరిధిలో అరెస్టయ్యారు. వీరు తమిళనాడు తిరువన్నామలై జిల్లా కు చెందిన 1.పి. మురుగన్, 2. ఎస్. సురేష్, 3 ఎం. చిన్నపయ్యన్, కాగా  వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు అతనిని  నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది.  

ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు ఎస్పీ  పీ. శ్రీనివాస్  తెలిపారు. నిందితులకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని ఆయన  అభినందించారు.