5 కిలోల మత్తు పదార్ధం.. కోటిన్నర ఎర్ర చందనం...
Published on: Sat Sep 13, 2014 3:21PM
.jpg)
హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్ చెక్‌పోస్ట్ దగ్గర ఎక్సయిజ్ అధికారులు వాహన సోదాలు జరుపుతుండగా కర్నాటక నుంచి వస్తున్న ఒక బస్సులో ఐదు కిలోల మత్తు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు దగ్గర భారీ సంఖ్యలో ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. లారీలో తరలిస్తున్న కోటిన్నర విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


