TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రకార్డు చూపించినందుకు ప్రాణాలు తీశాడు

Published on: Wed Feb 17, 2016 11:12AM

 

ఫుట్ బాల్ ఆడేటప్పుడు రిఫరీ ఎర్రకార్డుని చూపిస్తే ఏ ఆటగాడికైనా కోపం వస్తుంది. ఎందుకంటే ఆ ఆటగాడు తక్షణం ఆట నుంచి తప్పుకోవలసి వస్తుంది. అతని బదులు మరో ఆటగాడితో ఆటని కొనసాగించే అవకాశం కూడా సదరు జట్టుకి ఉండదు. అర్జెంటీనాలో ఇలాగే ఒక ఆటగాడికి ఎర్రకార్డుని చూసి కోపం వచ్చింది. అంతే నేరుగా తన సంచిలో ఉన్న పిస్తోలుని తీసి ‘సీజర్ ఫ్లోర్స్‌’ అనే రిఫెరీని కాల్చిపారేశాడు. నేరుగా తలలోకీ, గుండెల్లోనూ తూటాలు దూసుకుపోవడంతో రిఫరీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అర్జెంటీనా దేశంలోని యువతకు ఫుట్‌బాల్‌ అంటే ప్రాణం. తిండీతిప్పలు లేకపోయిన ఫుట్‌బాల్ లేకపోతే తట్టుకోలేరు. అందుకనే ఆ దేశం ఫుట్ బాల్ ప్రపంచకప్‌ని రెండుసార్ల కైవసం చేసుకుంది. ఫుట్ బాల్ పట్ల ఆ దేశ యువతలో ఉన్న ఇలాంటి వ్యామోహమే తరచూ ప్రాణాంతకమైన గొడవలకు కూడా దారి తీస్తుంది. ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లతో బాహాబాహీకి తలపడటం, రిఫరీ తనకి అనుకూలంగా లేడని అతని మీద ముష్టిఘాతాలు కురిపించడం... వంటి సంఘటనలు అక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. పోయిన ఏడాది ఒక రిఫరీ ఇలాగే ఆటగాళ్ల దబ్బలకు తాళలేక కోమాలోకి జారిపోయాడు.