Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీరు-మీరు.. తాగుడే తాగుడు.. రికార్డు స్థాయిలో అమ్మకాలు..
posted on: Apr 18, 2022 5:27PM
అసలే వేసవికాలం. ఎండలు మండేకాలం. దాహమేస్తే చల్లగా ఏ కూల్‌డ్రింకో, జ్యూసో తాగే రోజులు పోయాయ్. చల్లగా ఉండాలన్నా.. చిల్ మారో అనాలన్నా.. బీర్లతో చీర్స్ కొడుతున్నారు మందుబాబులు. ఎప్పటిలానే ఈసారి కూడా సమ్మర్‌లో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అంతకుమించి.. అనేలా కేసుల మీద కేసులు తాగేస్తున్నారు. కూల్‌డ్రింక్ తాగినట్టే.. ఇద్దరు ఫ్రెండ్స్ కలిస్తే.. రా మామా బీరేద్దాం..అంటున్నారు.
ఏపీలో తెలిసిందేగా. ఊరూపేరు లేని బ్రాండ్లు. చేదు గరళం లాంటి సరుకు. అందుకే, అక్కడ అంతగా అమ్మకాలు పెరగడం లేదు. అధికారులకు టార్గెట్లు పెట్టి మరీ అమ్మిస్తున్నా.. తాగేవారు ఇక తప్పదు అన్నట్టే తాగుతున్నారు. కానీ, తెలంగాణలో అలా కాదు. బీర్లు ఏరులై పారుతోంది.
గడిచిన 15 రోజుల్లో లక్షల్లో బీర్లు తాగేశారని అబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. వేసవిలో లిక్కర్ కంటే బీరు తాగడానికే మద్యం ప్రియులు జై కొడుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో.. ఉపసమనం కోసమంటూ సాకు చెబుతూ.. చల్లని బీరుతో గొంతు తడుపుకుంటున్నారు. ఈ మధ్య అమ్మాయిలూ తాగుడుకు ఎగబడుతుండటంతో.. సేల్స్ మరింత పెరుగుతున్నాయ్.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 15 రోజుల గ్యాప్‌లోనే దాదాపు 15 లక్షల కేసులకుపైగా బీర్లు అమ్ముడుపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఈ స్థాయిలో విక్రయాలు ఉంటే.. మే నెలలో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంటున్నారు.






