TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చికెన్ లాగించేశారు.. సంక్రాంతికి బిగ్ బిజినెస్‌...

Published on: Mon Jan 17, 2022 10:46AM

గ్రేటర్ హైదరాబాద్ పేరును నిలబెట్టారు నగర ప్రజలు. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ఏకంగా 60 లక్షల కిలోల చికెన్ వినియోగించి గ్రేట్ అనిపించారు. ఆదివారం ఒక్క రోజే వారు 30 లక్షల కిలోల చికెన్ లాగించేయడం విశేషం. శుక్ర, శనివారాల్లో గ్రేటర్ వాసులు 30 లక్షల కిలోల చికెన్ కొనుగోలు చేసి భోంచేశారు.

మామూలు రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు 10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయట. మటన్ అయితే రెండు లక్షల కిలోలు అమ్ముడవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. పండుగలేని ఆదివారం ఐదు లక్షల కిలోల మటన్ మాత్రమే గ్రేటర్ హైదరాబాద్ లో విక్రయం అవుతుంది. సంక్రాంతి సందర్భంగా 15 లక్షల కిలోలు విక్రయం అయిందని వ్యాపారుల అంచనా.
 
సంక్రాంతి రోజుల్లో మాంసం ప్రియులు ఇంత భారీ ఎత్తున చికెన్ కొనుగోలు చేయడానికి కారణం లేకపోలేదు. అదేంటంటే.. చికెన్ ధర తక్కువ ఉండడం. సంక్రాంతి పండుగ సందర్భంగా మటన్ కిలో ధర 850 రూపాయల నుంచి 900 రూపాయలు పలికింది. చికెన్ అయితే.. కిలో 240 రూపాయలకే అందుబాటులో ఉండడం కూడా వినియోగదారులు ఇంత పెద్ద ఎత్తున  కొనుగోలు చేయడానికి కారణం అని విశ్లేషిస్తున్నారు.