TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన సెల్ సరదా

Published on: Sat Sep 13, 2014 2:23PM

 

త్రిపురలో సెల్‌ఫోన్ సరదా ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసింది. పశ్చిమ త్రిపురలోని తకర్జల హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థినులు ముగ్గురు హాస్టల్లో నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లను రహస్యంగా వాడుతున్నారు. ఈ విషయం తెలిసి హాస్టల్ వార్డెన్ ఆ ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులను పిలిపించి వారి ముందే ముగ్గురు అమ్మాయిలకు వార్నింగ్ ఇచ్చారు. దాంతో ఆ ముగ్గురు అమ్మాయిలూ హాస్టల్ నుంచి పారిపోయారు. వీరిలో ఇద్దరు చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయారు. వీరిపై ఎలాంటి అత్యాచారం జరిగినట్టు ఆనవాళ్లు లేవని, సెల్‌ఫోన్ విషయంలో మందలించినందువల్లే ఆత్మహత్య చేసుకుని వుంటారని పోలీసులు చెబుతున్నారు.