TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీవీ9 ప‌త‌నానికి కార‌ణం ఎవ‌రు? కుట్ర కోణం దాగుందా?

Published on: Thu Mar 17, 2022 6:23PM

దేశంలోకే నెంబ‌ర్ వ‌న్ న్యూస్ నెట్‌వ‌ర్క్‌..అంటూ ప్ర‌తీ బ్రేక్‌లోనూ ఊద‌ర‌గొడుతుంది. మెరుగైన స‌మాజం కోసం అంటూ ప్రోమోలు న‌డుపుతుంది. చెప్పేవ‌న్నీ నీతులే అయినా.. చేసేది, చూపించేది మాత్రం వెగ‌టు వార్త‌లనే ఫీలింగ్‌. యాంక‌రమ్మ‌ల ఓవ‌రాక్ష‌న్‌. రుధిరం త‌ర‌హా ట్రోలింగ్స్‌. ఇవి చాల‌వ‌న్న‌ట్టు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు, రెండు ప్ర‌భుత్వాల‌కు నిత్యం భ‌జ‌న కార్య‌క్ర‌మాలు. వాటి ఫ‌లిత‌మే..  బార్క్ టీఆర్పీ రేటింగ్స్‌లో ఒక‌ప్ప‌టి నెంబ‌ర్ వ‌న్ న్యూస్ ఛానెల్ టీవీ9... ఇప్పుడు నెంబ‌ర్ 2కి ప‌డిపోయింది. Ntv నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్‌లో నిలిచింది. రేటింగ్ పాయింట్స్‌లో నెం.1కి... నెం.2కి మ‌ధ్య భారీ గ్యాప్ ఉంది. హైద‌రాబాద్ జోన్‌లో మాత్రం టీవీ9 ఆద‌ర‌ణ చెక్కుచెద‌ర‌క పోవ‌డమే కాస్త ఊరట.

ఏడాదిన్న‌ర త‌ర్వాత రిలీజ్ చేసిన బార్క్ టీఆర్పీ రేటింగ్స్ తెలుగు ఛానల్స్ స‌త్తా తేలిపోయింది. ఎన్టీవీ, టీవీ9 త‌ర్వాత వీ6, టీవీ5లు నిలుచాయి. సాక్షి, టీ-న్యూస్ త‌ర్వాతి స్థానానికి ఏబీఎన్ ప‌డిపోయింది. 10టీవీ, హెచ్ఎమ్‌టీవీ, మ‌హా న్యూస్‌లు.. ఈటీవీని దాటేశాయి. 

ర‌విప్ర‌కాశ్ చేతుల నుంచి రియ‌ల్ట‌ర్ల చేతికి టీవీ9 వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి.. ఛానెల్ ఎజెండా మారిపోయింది. న్యూస్ కంటే ప్ర‌జెంటేష‌న్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డం తెలుగు ఆడియ‌న్స్‌కి న‌చ్చ‌న‌ట్టుంది. టీవీ9 యాజ‌మాన్యం.. ఇటు కేసీఆర్‌కు, అటు జ‌గ‌న్‌కు అనుకూలంగా ఛానెల్‌ను న‌డిపిస్తుండ‌టంతో.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌.. ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా క‌నిపించ‌దు. వ్య‌క్తుల‌ ప‌ర్స‌న‌ల్ విష‌యాల్లో జోక్యం చేసుకోవ‌డాన్ని మాత్రం మాన‌లేదు. పొలిటిక‌ల్ మ‌సాలాను వ‌దిలేసి.. వాన‌లు.. యుద్ధాలను న‌మ్ముకోవ‌డం టీవీ9కి వ‌ర్క‌వుట్ అయిన‌ట్టు లేదు. న్యూస్‌ని వ‌దిలేసి.. సినిమా క్లిప్పులు, మ్యూజిక్కులు, గిమ్మిక్కులకు రేటింగ్స్ రావ‌బ్బా...

ర‌విప్ర‌కాశ్ ఉన్న‌ప్పుడు టీవీ9కి మంచి టీమ్ ఉండేది. కొత్త యాజ‌మాన్యం ర‌వి మ‌నుషుల‌నే ముద్ర‌తో ప‌లువురు స‌మ‌ర్థులైన ఇంచార్జుల‌ను సాగ‌నంపేసింది. మిగ‌తా ఉద్యోగులను ఎలాంటి ఇబ్బంది పెట్ట‌లేదు. సింగారావు అనే పెద్దాయ‌న‌కు టీవీ9 బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆయ‌న టీవీ9 ఆత్మ‌ను కిల్ చేశార‌ని అంటారు. ఈటీవీ స్టైల్‌లో ప్లేన్‌గా టీవీ9ని న‌డిపార‌ని చెబుతారు. అదే స‌మ‌యంలో సింగారావుకు బిగ్ డిబేట్లు చేసే ర‌జ‌నీకాంత్‌కు మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డిచింది. ఆ ఆధిప‌త్య పోరులో ర‌జ‌నీకాంత్ చేతికి టీవీ9 ప‌గ్గాలు వ‌చ్చి.. సింగారావు 10టీవీకి షిఫ్ట్ కావాల్సి వ‌చ్చింది. ఇక‌, ర‌జ‌నీ వ‌చ్చాక మ‌రింత రాజ‌కీయం న‌డిచిన‌ట్టు తెలుస్తోంది. సంస్థ‌లో మిగిలిన ర‌వి ప్ర‌కాశ్ మ‌నుషుల‌ను, సింగారావు టీమ్‌ను టార్గెట్ చేశార‌ని.. టార్చ‌ర్ పెట్టార‌ని అంటారు. అది బాలేదు.. ఇది క‌వ‌ర్ చేయ‌లేదు.. అంటూ ప‌దే ప‌దే కావాల‌నే అసంతృప్తి వ్య‌క్తం చేసేవార‌ని చెబుతారు. ఇన్‌పుట్ ఎడిట‌ర్ ముర‌ళీకృష్ణ‌తో స‌హా, ప‌లువురు యాంక‌ర్లు, మంచి ఎడిటోరియ‌ల్ టీమ్.. ర‌జ‌నీకాంత్ వేటుకు బ‌ల‌య్యార‌ని సంస్థ‌ సిబ్బందే చెబుతున్నారు. ఇక‌, ఎలాంటి అనుభ‌వం, సామ‌ర్థ్యం లేకున్నా.. త‌న వ‌ర్గం సిబ్బందిని కుల ప్రాతిపదిక‌న ప్ర‌మోష‌న్స్‌ ఇచ్చి.. అంద‌లం ఎక్కించార‌ని అంటారు. ప్రస్తుతం టీవీ9 ఇన్‌పుట్‌, అవుట్‌పుట్ చాలా వీక్‌గా ఉంద‌ని.. అందుకే, నెంబ‌ర్ వ‌న్ ఛానెల్ కాస్తా.. చాలా వెన‌క‌బ‌డి నెంబ‌ర్ 2గా చ‌తికిల ప‌డింద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. 

ఇక‌, ర‌జ‌నీకాంత్.. ఏడాదిన్న‌ర‌గా విషమ ప‌రీక్ష ఫేస్ చేశారని అంటున్నారు. రేటింగ్స్ రాబోతున్నాయ‌ని తెలిసి.. నెల రోజులుగా సంస్థ ఉద్యోగుల‌ను తెగ టార్చ‌ర్ చేస్తున్నార‌ని టాక్‌. మిడ్ నైట్ ఆకస్మిక తనిఖీలతో అదరగొట్టారట. మీటింగ్స్‌లో పెద్ద పెద్ద‌గా అర‌వ‌డం.. చిటికీమాటికీ కోపం తెచ్చుకోవ‌డం.. రేటింగ్ త‌గ్గితే భ‌రించ‌లేనంటూ వార్నింగులు ఇవ్వ‌డం.. ఇలా కొంత‌కాలంగా ర‌జ‌నీ సార్‌.. చాలా చాలా అస‌హ‌నంగా ఉన్నార‌ట‌. మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. డెస్క్ సిబ్బంది ఎన్టీవీని ఫాలో అవుతూ వార్త‌లు వేస్తున్నారంటూ.. ఆఫీసులో ఎన్టీవీ రాకుండా ప్ర‌సారాలు క‌ట్ చేయించార‌ట ర‌జ‌నీకాంత్‌. ఇప్పుడు అదే ఎన్టీవీ నెంబ‌ర్ 1 ఛానెల్‌గా నిల‌వ‌డం.. టీవీ9 రేటింగ్ దారుణంగా ప‌డిపోవ‌డం ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  ఇప్ప‌టికే ర‌జ‌నీకాంత్‌ ఫ్ర‌స్టేష‌న్ పీక్స్‌కి చేర‌గా.. లేటెస్ట్ రేటింగ్స్‌తో.. టీవీ9లో ర‌జ‌నీకాంత్ భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారిందంటున్నారు. దీని వెనుక కుట్ర కోణ‌మూ దాగుంద‌నే అనుమానం కూడా ఉంది. య‌జ‌మాన్యం ఆయ‌న‌పై ఇంకా న‌మ్మ‌కం ఉంచితే ఓకే.. లేదంటే...!?

ఇక‌, ఏబీఎన్‌, టీవీ5, సాక్షిలు.. వ‌న్‌సైడ్ న్యూస్ ఇస్తుండ‌టంతో ఆడియ‌న్స్.. పొలిటిక‌ల్‌గా స్పైసీ వార్త‌లు, క్రైం ఫ్లేవ‌ర్ ఉండే ఎన్టీవీ వైపు షిఫ్ట్ అయ్యారేమో అనిపిస్తోంది. టీవీ9పై ఉన్న అసంతృప్తి, అస‌హ్య‌మే ఎన్టీవీకి క‌లిసొచ్చిన‌ట్టుంది. Ntv సైతం రెండు ప్ర‌భుత్వాల‌కు స‌పోర్ట్ ఛానెలే అయినా.. మ‌రీ వ‌న్‌సైడ్ లేకుండా చూసుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఆస‌క్తిక‌ర మేట‌ర్ ఏంటంటే.. టీవీ9 యాజ‌మాన్యానికి ఎన్టీవీలోనూ పెట్టుబ‌డులు ఉండ‌టం. నెంబ‌ర్ 1.. నెంబ‌ర్ 2లు ఎవ‌రైనా.. డ‌బ్బులు వ‌చ్చేది మాత్రం వారికే! ప‌రోక్షంగా ఆ రెండు ఛానెల్స్ ప‌ని చేసేది ఆ ఇద్ద‌రి కోస‌మే!!