బాబోయ్.. ప్రకాశ్‌రాజ్ ఓటమికి ఇన్ని కారణాలా..?
Published on: Mon Oct 11, 2021 1:08PM
మంచు విష్ణు చేతిలో ప్రకాశ్‌రాజ్ ఘోర పరాజయం. మెగా ఫ్యామిలీ మద్దతిచ్చినా.. ప్రకాశ్‌రాజ్ ఓడిపోవడం ఒకింత షాకింగ్ విషయమే. ఇన్నాళ్లూ టాలీవుడ్ తమ గుప్పిట్లో ఉందని భావించిన మెగా-అల్లు కుటుంబానికి ప్రకాశ్‌రాజ్ ఓటమి ఊహించని పరిణామమే. అయితే, ఇదంతా ప్రకాశ్‌రాజ్ స్వయంకృతాపరాధమేనని అంటున్నారు. మా ఎన్నికల విషయంలో మెగా సపోర్ట్‌ను పక్కనపెట్టేసి మరీ, ప్రకాశ్‌రాజ్‌ను అన్ని శక్తులు కలిసి ఓడించాయని విశ్లేషిస్తున్నారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు.. ఆయన ఓటమికి అనేక రీజన్స్ చెబుతున్నారు.
ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన ప్రకాశ్‌రాజ్.. మోదీ వ్యతిరేకనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే,, మా ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సైతం స్పందించి.. విచ్చిన్నకర శక్తులకు ఇది గుణపాఠమన్నారు. మా ఎన్నికల్లో బీజేపీ వర్గమంతా ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా పని చేసింది. విజయశాంతి, బాబుమోహన్, సీవీఎల్ లాంటి వాళ్లు ప్రకాశ్‌రాజ్ ఓటమి కోసం గట్టిగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు.
బీజేపీ అనే కాదు.. టీడీపీ వర్గీయులు సైతం ప్రకాశ్‌రాజ్‌కు యాంటీగా పని చేశారు. 2018లో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. తెలంగాణలో చంద్రబాబుకు ఏం పని అంటూ.. 2018 ఎన్నికల్లో లోకల్ వాయిస్ రైజ్ చేశారు ప్రకాశ్‌రాజ్. ఇప్పుడు అదే లోకల్ వాయిస్‌తో పరభాషీయుడైన ప్రకాశ్‌రాజ్‌కు 'మా'తో ఏం పని అంటూ టీడీపీ సానుభూతిపరులంతా ఆయనకు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు.
ఇక, వైసీపీ వర్గం సైతం ప్రకాశ్‌రాజ్‌ను ఓడించడంలో కీ రోల్ ప్లే చేసింది. వైఎస్ జగన్, మంచు విష్ణులు దగ్గరి బంధువులు. సో, జగన్ బ్యాచ్ అంతా మంచుకే మద్దతు ఇచ్చింది. ఇక, ఆన్‌లైన్ టికెటింగ్‌పై పవన్‌కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని కుమ్మేయడం.. మెగా ఫ్యామిలీ ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్ చేయడంతో.. వైసీపీ సానుభూతిపరులంతా మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు యాంటీగా ఓటింగ్ చేశారు.
ఇలా.. రాజకీయ కారణాలతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్ సైతం మంచు విష్ణుకు అనుకూలంగా, ప్రకాశ్‌రాజ్‌కు వ్యతిరేకంగా మారింది. మొదటి నుంచీ 'మా'లో ఆధిపత్యం అంతా కమ్మ వర్గీయులదే. మురళీమోహన్ ఏకంగా ఐదు సార్లు మా అధ్యక్షులుగా ఉన్నారు. మోహన్‌బాబు, నాగార్జున, నరేశ్, రాజేంద్రప్రసాద్.. ఇలా పలువురు కమ్మ వారు 'మా'కు ఆధిపత్యం వహించారు. మంచు విష్ణు సైతం కమ్మనే. ఆయన సతీమణి రెడ్డి-క్రిష్టియన్ కావడంతో ఆ వర్గాలూ సపోర్ట్ చేశాయి. ప్రకాశ్‌రాజ్ చిత్తుచిత్తుగా ఓడేందుకు కారణమయ్యాయి.


