డీజీపీ లీవ్‌కు వేరే రీజనుందా? త్వరలో సంచలన నిర్ణయమా?
Published on: Fri Feb 25, 2022 4:24PM
ఏపీలో డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై వేటు వేశారు సీఎం జగన్. ఇంచుమించు అదే టైమ్‌లో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సెలవుల్లో వెళ్లారు. అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏపీలో అలా జరిగింది కాబట్టి.. తెలంగాణలో కూడా సీఎంకు డీజీపీకి మధ్య తేడా వచ్చిందా? అంటూ ఆరా తీశారు. అలాంటిదేమీ లేదని.. డీజీపీ మహేందర్‌రెడ్డి బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారని.. చేయి విరిగిందని.. అందుకే రెండు వారాలు లీవ్ పెట్టారంటూ వార్తలు వచ్చాయి. ఓహో.. అంతేనా.. ఇంకేం లేదా.. అయితే ఓకే అంటూ అంతా సర్దుకున్నారు. అయితే, లేటెస్ట్‌గా మరో ఆసక్తికర విషయం అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది.
చిన్న విషయం.. చెయ్యి ఫాక్చర్ అయితే.. చేతికి కట్టు కట్టుకొని విధులు నిర్వర్తించవచ్చుగా? డీజీపీ లెవెల్ అధికారి.. రివ్యూలు, సిబ్బందికి డైరెక్షన్స్ ఇస్తే సరిపోతుందిగా? అంతగా బరువులు ఎత్తే పనేమీ ఉండదుగా? కరోనా టైమ్‌లో ఇంటి నుంచి పని చేసిన సందర్భాలు లేవా? ఇప్పుడూ అలానే చేయొచ్చుగా? పని బడా సెలవులు పెట్టాల్సినంత సీరియసా? అనే డౌట్ కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక, మరికొందరైతే అసలు గాయమే కాలేదని.. ఆ కారణంతో సెలవు పెట్టారని కూడా అంటున్నారు. డీజీపీ రేంజ్ మేటర్ కదా.. అంత ఈజీగా అసలు విషయం బయటకు పొక్కదంటున్నారు.
అయితే, ఉన్నత స్థాయి వర్గాల ద్వారా ఓ కీలక విషయం తెలియవస్తోంది. ఇటీవల మెదక్ జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. ఐఏఎస్ వదులుకుంటే.. ఏకంగా ఎమ్మెల్సీ హోదానే వరించింది ఆయనకు. సేమ్ టు సేమ్.. మాజీ ఐఏఎస్, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బాటలోనే ప్రస్తుత డీజీపీ, ఐపీఎస్ మహేందర్‌రెడ్డిని నడిపించాలని సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఆ మేరకు మహేందర్‌రెడ్డితో ఓ దఫా మంతనాలు కూడా జరిపారని అంటున్నారు. అయితే, మహేందర్‌రెడ్డి మాత్రం తన సర్వీస్ ముగిసే వరకూ పదవిలో కొనసాగుతానని.. ఇప్పటికిప్పుడు అంటే కుదరదని చెప్పారని చెబుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్‌కు ఆయనకు మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని.. ఆ ఫలితమే.. ఇలా సెలవుల్లో వెళ్లారో.. లేక, పంపించారో.. అనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే డీజీపీ మహేందర్‌రెడ్డి విషయంలో సంచలన నిర్ణయం ఉండబోతోందని మాత్రం తెలుస్తోంది. ఆయనపై వేటు పడుతుందో? గులాబీ కండువా పడుతుందో చూడాలి..!!


