TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీజీపీపై వేటుకు ఆ రెండే కార‌ణమా?.. జ‌గ‌న‌న్న‌ వాడుకొని వ‌దిలేశారా?

Published on: Tue Feb 15, 2022 1:38PM

ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌పై బ‌దిలీ వేటు ప‌డింది. ఆయ‌న‌కు ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా చాలా అవ‌మాన‌క‌ర‌రీతిలో పంపించేశారు. ప్ర‌స్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న క‌సిరెడ్డి రాజేంద్ర‌నాథ్‌రెడ్డికి డీజీపీగా తాత్కాలిక బాధ్య‌త‌లు అప్ప‌గించారు. రెడ్డి-రెడ్డి యాంగిల్‌లో క‌సిరెడ్డి వైపే సీఎం జ‌గ‌న్‌రెడ్డి మొగ్గుచూపారని అంటున్నారు. 

డీజీపీగా గౌత‌మ్ స‌వాంగ్ బ‌దిలీ వెన‌క ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వ ఉద్యోగులు ఛ‌లో విజ‌య‌వాడ‌తో జ‌గ‌న్ స‌ర్కారుపై క‌దం తొక్కారు. వెయ్యో.. రెండువేల మందో వ‌స్తార‌ని అనుకోగా.. వేలు, ల‌క్ష‌ల్లో ఉద్యోగులు విజ‌య‌వాడ చేరుకోవ‌డం పోలీసుల వైఫ‌ల్య‌మేనంటూ డీజీపీపై సీఎం జ‌గ‌న్‌రెడ్డి తీవ్ర ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. చ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ కావ‌డం వ‌ల్లే.. పీఆర్సీపై ప్ర‌భుత్వ కాస్త త‌గ్గాల్సి వ‌చ్చింది. జ‌గ‌న్ ప‌రువంతా పోయింది. నిజానికి, చ‌లో విజ‌య‌వాడ స‌క్సెస్ కావ‌డం ఇంటెలిజెన్స్, సీఐడీ విభాగాల‌ ఫెయిల్యూర్‌. ఆ మేర‌కు వేటు వేస్తే.. ఐబీ చీఫ్ రాజేంద్ర‌నాథ్‌రెడ్డికో, సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్‌నో బ‌దిలీ చేయాల్సింది. కానీ, పోలీస్ బాస్‌గా ఉన్న గౌత‌మ్ స‌వాంగ్‌నే బ‌లిప‌శువు చేశార‌ని అంటున్నారు. 

ఇక‌, చ‌లో విజ‌య‌వాడ‌తో పాటు ఇటీవ‌ల అరెస్టై, బెయిల్ మీద విడుద‌ల అయిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఎపిసోడ్ మీదా సీఎం జ‌గ‌న్ గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. పోలీసులు బ‌ల‌మైన సెక్ష‌న్ల ప్ర‌కారం కేసు పెట్ట‌లేక‌పోయార‌ని.. అందుకే అశోక్‌బాబుకు అంత ఈజీగా బెయిల్ వ‌చ్చింద‌ని ముఖ్య‌మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని అంటున్నారు. ప‌దేళ్ల పైబ‌డే శిక్ష ప‌డే సెక్ష‌న్లు పెట్ట‌కుండా.. ముందుగా ఆ సెక్ష‌న్లు ఎఫ్ఐఆర్‌లో చేర్చ‌కుండా.. ఆ త‌ర్వాత‌ రిమాండ్ రిపోర్ట్‌లో పొందుప‌ర్చినా.. కోర్టులో అది వీక్ అయిపోయింద‌ని.. అందుకే బెయిల్ వ‌చ్చిందంటూ సీఎంవోకు రిపోర్ట్ వెళ్లిన‌ట్టు స‌మాచారం. ఈ రెండు వైఫ‌ల్యాల‌తో జ‌గ‌న్‌కు ఫుల్‌గా స‌హ‌క‌రించిన డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌ను ఇక మీ సేవ‌లు చాలంటూ పంపించేస్తున్నార‌ని అంటున్నారు. 

మ‌రోవైపు, డీజీపీ బ‌దిలీ వెన‌క మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. సీఎం జ‌గ‌న్‌రెడ్డి ఆయ‌న్ను త‌ప్పించారా?  లేక‌, స‌వాంగే త‌న‌కు ఆ ప‌ద‌వి వ‌ద్దు బాబోయ్ అంటూ వైదొలుగుతున్నారా? అనే డౌట్‌. పోలీస్ బాస్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచీ జ‌గ‌న్‌కు, వైసీపీకి కొమ్ముకాస్తూ వ‌చ్చారంటూ టీడీపీ ప‌దే ప‌దే విమ‌ర్శించింది. కేవ‌లం ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పైనే కేసులు పెట్ట‌డం.. అధికార పార్టీ వాళ్లు స్వేచ్ఛ‌గా రెచ్చిపోయేందుకు స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా ఉన్నాయి. మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసును వైసీపీ మూక‌లు ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌లో ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. చంద్ర‌బాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే దాడికి ప్ర‌య‌త్నించ‌డం.. ఏపీలో గంజాయి, డ్ర‌గ్స్ మాఫియా క‌ట్ట‌డిలో వైఫ‌ల్యం.. టీడీపీ నేత‌ల అరాచ‌క అరెస్టులు.. ఇలా అనేక అంశాల్లో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌పై నేరుగా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆయ‌న జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వానికి పూర్తిగా స‌హ‌క‌రించార‌నే ఆరోప‌ణ ఉంది. అయితే, అవ‌న్నీ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే చేసినా.. త‌న‌కు జీహుజూర్ అంటూ ప‌ని చేసిన‌ గౌత‌మ్ స‌వాంగ్‌ను బ‌లిప‌శువు చేసేలా ఇప్పుడాయ‌న‌పై వేటు వేశార‌ని అంటున్నారు. ప్ర‌తిప‌క్షాల ఆరోపణ‌ల నేప‌థ్యంలోనే వేటు వేశామ‌ని చెప్పుకున్నా చెప్పుకుంటారీ ఘ‌నులు.