Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆపరేషన్ సింధూర్.. ఈ పేరు వెనుక రహస్యం ఇదే..!
posted on: May 10, 2025 9:30AM

మూడు రోజుల కిందట భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది. ఈ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్‌లోని అనేక ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసింది. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటన మరుసటి రోజు యావత్ భారతదేశాన్ని ఆకర్షించింది. ఈ వార్త వెలువడిన వెంటనే, దేశవాసుల తడి కళ్ళు భారత సైన్యం పట్ల విశ్వాసం, గౌరవాన్ని ప్రతిబింబించాయి. ఇది కేవలం ఒక ఆపరేషన్ కాదు భారత దేశ పౌరులపై జరిగిన పిరికి దాడికి తగిన సమాధానం. ఈ ఆపరేషన్ కు సింధూర్ అనే పేరు పెట్టడం దేశాన్ని, దేశ ప్రజలను మరింతగా ఆకర్షించింది. ఈ పేరు వెనుక ఉన్న రహస్యం తెలుసుకుంటే..
"సిందూర్" అనేది ఒక చిన్న ఎర్ర చుక్క. ఇది భారతీయ హిందూ మత స్త్రీలకు ఎంతో పవిత్రమైనది. ఇది భారతీయ స్త్రీ గౌరవం, ప్రేమ మరియు శక్తికి చిహ్నం. స్త్రీల నుదుటిపై ఉన్న సింధూరం పహల్గామ్ భూమిపై రక్తంతో కలిసినప్పుడు, ఈ అవమానాన్ని సహించబోమని దేశం నిర్ణయించుకుంది. ఈ భావన ఫలితంగానే ఆపరేషన్ సింధూర్ ఏర్పడింది.
ప్రాముఖ్యత..
భారతీయ సంస్కృతిలో సిందూరం అలంకరణలో ఒక భాగం మాత్రమే కాదు, ఇది లోతైన మతపరమైన, సాంస్కృతిక అర్థాలతో కూడా ముడిపడి ఉంది. ఇది వివాహిత స్త్రీ గుర్తింపుకు, తన భర్త దీర్ఘాయుష్షు పొందాలనే కోరికకు చిహ్నం. స్త్రీ నుదిటిన సింధూరం పెట్టుకుంటారు. దీనిని అజ్ఞ చక్రం లేదా మూడవ కన్ను అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం ఆత్మ, చైతన్యానికి కేంద్రంగా పరిగణించబడుతుంది.
శక్తి..
సింధూరం ఎరుపు రంగు లో ఉంటుంది. ఇది శక్తకి చిహ్నం. ఇది శక్తిని, పోరాటాన్ని సూచిస్తుంది. ఈ రంగు స్త్రీ అంతర్గత బలం, దృఢత్వాన్ని కూడా తెలియజేస్తుంది. దుర్గాదేవి విగ్రహాన్ని పూజించేటప్పుడు అమ్మవారి నుదిటిపై సింధూరం పూయడానికి ఇదే కారణం.
శాంతియుతంగా ఉండే భారతదేశం చాలా పవిత్రమైన, ఎంతో గొప్ప దేశంగా పేర్కొనబడుతుంది. అయితే అదే సమయంలో భారతదేశ పౌరుల మతం, గౌరవం దెబ్బతింటే ముఖ్యంగా మహిళల గౌరవం, మహిళల జీవితం, మతం మీద దాడి జరిగితే ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్ వివరిస్తుంది. చిటికెడు సింధూరం ధర తక్కువే కానీ, భారతీయ మహిళల నుదుటన ఉన్న సింధూరం జోలికి వెళితే ఎలా ఉంటుందో ఎంతటి పర్యవసానాలు ఉంటాయో ఆపరేషన్ సింధూర్ తెలుపుతుంది.
*రూపశ్రీ.


.webp)
.webp)


