TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజీనామాల వెనక అసలు కారణమేంటి?

Published on: Thu Jul 19, 2018 12:28PM

గతంలో రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు ఇప్పుడు కీలక సమయంలో రేపు జరగనున్న చర్చకు దూరమయ్యి ప్రేక్షక పాత్ర వహించాల్సివస్తోంది.అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చకు టీడీపీ సిద్ధమవుతుంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పార్లమెంట్ వెలుపల నిరసన తెలపటం సభబేనా అని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

 

 

ఆర్ధిక మంత్రి యనమల కూడా వైసీపీ ఎంపీల తీరును ఎండకట్టారు. జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని అందుకే అవిశ్వాసంలో వైకాపా ఎంపీలు పాల్గొనకుండా భాజాపా సహకారంతో జగన్ ఆడిన నాటకం అని ఆయన ఎద్దేవాచేశారు.ప్రత్యేక హోదా,రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ ద్రుష్టి లేదని, భాజపా సాయంతో కేసుల నుంచి బయటపడటమే ఆయన లక్ష్యమని యనమల ఆరోపించారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ, వైసీపీ ల దోస్తీ బట్టబయలు అయిందని మండిపడ్డారు. కడప ఉక్కు కర్మాగారంపై మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుంటే, సొంత జిల్లాకే న్యాయం చేయలేని వాడు రాష్ట్రానికి ఏ విధంగా నాయకత్వం వహిస్తాడు,ఇంత బాధ్యతారాహిత్యం కలిగిన నేతను తాను ఎక్కడా చూడలేదని యనమల విమర్శించారు.