కేసీఆర్ మౌనం వెనక మతలబు ఏమిటి ?
Published on: Mon Jan 31, 2022 10:49AM
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈరోజు (సోమవారం) మొదలయ్యాయి.ఈ సమావేశాలు ఎప్పటిలానే రెండు విడతల్లో జరుగుతాయి. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకూ తొలి విడత, మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కొవిడ్ నిబంధనల నడుమ జరుగతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతాయని ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ నెల 10 వతేదీన తోలి విద్ పోలింగ్ జరగనుంది.ఈ నేపధ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను అధికార ప్రతిపక్షాలు, ప్రచార వేదికలుగా మలచున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. వర్షాకాల సమావేశాలు, ఆల్మోస్ట్ తుడిచి పెట్టుకు పోయాయి. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అంశం, పెగాసిస్ స్పైవేర్ వ్యవహారం వంటివి ఈసారి పార్లమెంటులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉభయ పక్షాలకూ కీలకం కానున్నాయి.
అదలా ఉంటే తెలంగాణ రాజకీయాలు, తెరాస వర్సెస్ బీజేపీ, రాష్ట్రం వర్సెస్ కేంద్రం అన్నట్లుగా మారిన నేపధ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెరాస సభ్యులు ఎలా ప్రవర్తిస్తారు, ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తిని రేకిస్తోంది. గత నవంబర్,డిసెంబర్ మాసాల్లోజరిగిన వర్షకాల సమావేశాల్లో తెరాస ఎంపీలు ముందు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కొంత అగ్రెసివ్’గా దూకుడు ప్రదర్శించినా, మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయ్యారు. బాయ్ కాట్ పేరున అస్త్రసన్యాసం చేసి బయట పడ్డారనే విమర్శలు ఎదుర్కున్నారు.
ఆలాగే, కాంగ్రెస్’ పార్టీకి దగ్గరయ్యేందుకు చేసిన ప్రయత్నం కూడా సక్సెస్ కాలేదు. రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్’ ఫై కాంగ్రెస్ సారధ్యంలో జరిగిన సమావేశానికి, తెరాస పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే. కేశవ రావు (కేకే) హాజరయ్యారు కానీ, ఆ తర్వాత పీసీసీ చీఫ్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తెరాసతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా కేకే పిలవని పేరంటానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఈనేపధ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెరాస కేంద్రం పై యుద్దాన్ని కొనసాగిస్తుందా? రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ, తెరాసను దూరంగా ఉంచుతుందా? అదే కేసేఆర్ కలలు కంటున్న, ఫెడరల్ ఫ్రంట్’కు ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసివస్తాయా ... తెరాస కాంగ్రెస్’తో చేతులు కేంద్రంపై నిజగానే కత్తులు దూస్తుందా .., ఇలా .. తెరాస ఎంపీల ప్రతికదలిక మీద కెమెరా కన్నేసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
అదలా ఉంటే, తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశంలో, తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అయితే, ఆయన స్వరంలో అంత కరుకుదనం లేదని, అంటున్నారు. నిజానికి గతంలో ముఖ్యమంత్రి స్వయంగా మీడియా ముందుకు వచ్చి కేంద్రం ఫై యుద్ధం ప్రకటించారు. కానీ, ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన తర్వాత, మీడియా ముందుకు వచ్చిన ఎంపీ రంజిత్‌రెడ్డి చో ..చో..గా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై కేసీఆర్ చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు సీఎం ఇచ్చారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని కేసీఆర్ తప్పుబట్టారు, అందుకు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు అంటూ పొడి పొడిగా నాలుగు ముక్కలతో సరిపెట్టారు. అలాగే, విభజన అంశాలను పార్లమెంట్లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడుతామని రంజిత్‌రెడ్డి తెలిపారు.మరో వంక, యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పిన కేసీఆర్, కేటీఆర్ ఆవిషయమ్లో సైలెంట్ అయి పోయారు.
కాగా, ముఖ్యమంత్రి కేసేఆర్ స్వరం మారిందని, అయన ధోరణిలో మార్పు/ భయం కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఇది ... సంధికి సంకేతమా లేక ప్రళయం ముందు ప్రశాంతతా, అనేది స్పష్టం కావలసి ఉందని అంటున్నారు. అయితే అటు నుంచి అయినా ఇటు నుంచి అయినా అసలు యుద్ధం మార్చి 10 న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత,మార్చి 14 నుంచి మొదలయ్యే మలివిడత బడ్జెట్ సమావేశాల్లోనే బయటకు వస్తుందని, అంతవరకు వరకు కేసేఅర్ వ్యూహాత్మక మౌనమే పాటిస్తారని అంటున్నారు.


