TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తొక్కిసలాట ఘటనపై సిద్ధరామయ్య విచారం.. రూ.10 లక్షల పరిహారం

Published on: Wed Jun 4, 2025 9:32PM

 

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.చిన్నస్వామి స్టేడియం 30వేలు మాత్రమే కానీ 3 లక్షల మంది అభిమానులు వచ్చారని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని అన్నారు.తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని ఆయన ప్రకటించారు.మంగళవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆలస్యంగా ముగియడంతో, రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఈ విజయోత్సవాలను ఏర్పాటు చేసిందని, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టామని ఆయన వివరించారు."ప్రజల స్పందన మా అంచనాలను మించిపోయింది. 

విధానసౌధ ముందు లక్షకు పైగా జనం గుమిగూడినా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. కానీ  స్టేడియం వద్ద ఈ విషాదం సంభవించింది. క్రికెట్ అసోసియేషన్ గానీ, ప్రభుత్వం గానీ ఇంతటి పరిణామం ఊహించలేదాని ఆయన తెలిపారు. చిన్న‌స్వామి స్టేడియం తొక్కిస‌లాట‌పై ప్ర‌ధాని మోదీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపిన ఆయ‌న మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. అంతేకాదు ఆత్మీయుల‌ను కోల్పోయిన కుంటుంబలకు కేంద్ర త‌ర‌ఫున‌ రూ. 2 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వాళ్ల‌కు రూ. 50 వేల ప‌రిహారం చెల్లిస్తామ‌ని మోడీ వెల్ల‌డించారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు