Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ
posted on: Jun 6, 2025 12:35PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మళ్లీ తగ్గించింది. ఆర్డీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వరుసగా ఇది మూడో సారి ఈ రోజు ముగిసిన ద్రవ్యపరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. గతంలో పాతిక బేసిస్ పాయింట్ల వరకూ వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ ఈ సారి 50 బేసిస్ పాయిట్లను తగ్గించింది.
ఈ తాజా తగ్గింపుతో రెపో రేటు 6 నుంచి 5.50 శాతానికి దిగివచ్చింది. ఈ తగ్గింపు వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయి. ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మీడియాకు తెలిపారు. ఈ సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనాను 3.7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం ఈ రోజు ముగిసింది.


.webp)
.webp)


