TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తారవల్లే చేజారిన చైర్మన్ గిరీ

Published on: Fri Aug 31, 2012 4:47PM

సెక్స్‌రాకెట్‌ గుట్టువిప్పిన సంచలన తారచౌదరి రాజకీయపార్టీల కీలక నేతలందరితోనూ సంబంధాలు నెరిపినట్లు ఆరోపణలున్నాయి. ఆమె గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుపై బహిరంగ ఆరోపణలు చేశారు. తనతో సాంబశివరావు నెరిపిన సంబంధాన్ని ఎప్పటికైనా బహిరంగపర్చగలనని ఆమె ప్రకటించారు. అంతే కాకుండా రెండు, మూడు సంఘటనలను ఆమె ఉదహరించారు. ఈ ఉదహరణలకు తలొగ్గిన సాంబశివరావు వెనక్కి తగ్గారు. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడి ఇరకాటంలో పడటం ఎందుకు అని సాంబశివరావు మౌనంవహించారు. అయితే మౌనం అర్ధఅంగీకారం అని కూడా తెలిసినా రాయపాటి ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. తిరుమలతిరుపతి ఛైర్మన్ పదవిని ఇవ్వాలని సాంబశివరావు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరడంతో సోనియాకూడా ఆయనకా పోస్ట్ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. రాయపాటి వైరివర్గం నేరుగా ఢిల్లీకెళ్లి తారాచౌదరితో ఉన్న లింకుల వ్యవహారాన్ని రచ్చరచ్చ చేయడంతో చేతికొచ్చిన పదవికాస్తా చేయిజారిపోయింది.