రాయపాటిపై ఆజాద్ సీరియస్
Published on: Mon Jan 23, 2012 8:36AM
హైదరాబా
ద్: మంత్రివర్గ విస్తరణను సాకుగా తీసుకుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలపై తీవ్ర విమర్శలు చేసిన గుంటూరు ఎంపీ, సీనియర్ నేత కావూరి సాంబశివరావు వైఖరి పట్ల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఆదివారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన రాయపాటిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో తేరుకున్న రాయపాటి విమర్శలు చేసి 24 గంటలు కాకముందే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడికి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వారిద్దరూ సమన్వయంతోనే పని చేస్తున్నారని రాయపాటి అన్నారు.


