TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యర్ధమవుతున్న రూ.500 కోట్ల ఎర్రచందనం

Published on: Mon Feb 20, 2012 1:08PM

రాయలసీమ: స్మగర్ణ దాష్టికానికి రాయలసీమ ప్రాంతంలోని అడవుల్లో ఎర్రచందనం వృక్షాలు తరిగిపోతున్నాయి. స్మగర్లనుంచి స్వాధీనంచేసుకుంటున్న దుంగలతో గోదాములు నిండిపోతున్నాయి. వాటిని విక్రయించాలనుకుంటున్న నేపధ్యంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్ని కట్టేసింది. దీంతో సుమారు రూ.500 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలు ఎండకు ఎండి, వానకు తడుస్తూ విలువను కోల్పోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదారు సంవత్సరాలుగా సుమారు 10వేల టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్మగర్లనుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 స్టాక్ పాయింట్లలో నిలువచేశారు. మార్కెట్లో టన్ను ఎర్రచందనం ధర రూ.5 లక్షల వరకు పలుకుతుంది. అయితే స్టాక్ పాయింట్లో ఆరుబయటే ఈ దుంగలను పడేయటంతో అవి ఎండకు ఎండి, వానకు తడిచి తమ విలువను కోల్పోతున్నాయి. తడిచినా, ఎండినా ఎర్రచందనం దుంగలకు రేటు సగానికి సగం పడిపోతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలవల్ల రాష్ట్ర ప్రభుత్వం వీటిని విక్రయించుకోలేకపోతుంది. ఇప్పటికే స్టాక్ పాయింట్లన్నీ స్వాధీనంచేసుకున్న ఎర్రచందనం దుంగలతో నిండిపోయాయి. వెంటనే వీటిని విక్రయించకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని అటవీశాఖ అధికారులు అంటున్నారు.