TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రవితేజ పవర్ కి రికార్డు బ్రేక్స్

Published on: Wed Jan 29, 2014 9:46AM

 

పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది" చిత్ర టీజర్ ఏ క్షణాన విడుదలయ్యిందో కానీ... అప్పటినుండి యూట్యుబ్ లో రికార్డులు మొదలయ్యాయి. పవన్ సినిమా టీజర్ ను అత్యధిక స్థాయిలో వీక్షించి రికార్డులు క్రియేట్ చేసారు. ఆ తర్వాత వచ్చిన మహేష్ "1" సినిమా టీజర్ కు రికార్డులు బద్దలు కొట్టే రేంజులో వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా అదే జాబితాలోకి మాస్ మహారాజ రవితేజ త్వరలోనే చేరనున్నారు. రవితేజ నటిస్తున్న "పవర్" సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను ఇటీవలే తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ టీజర్ కు యూట్యుబ్ లో కేవలం రెండు రోజుల్లోనే 4,47,000 వ్యూస్ వచ్చాయి. అంటే త్వరలోనే రవితేజ కూడా తన సత్తా ఏంటో చూపించనున్నాడని అర్థం అవుతుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.