మాస్ రాజ మొదలెట్టేసాడు
Published on: Thu Dec 12, 2013 8:55AM

"బలుపు" సినిమాతో రచయితగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర ముహూర్తపు కార్యక్రమాలు నిన్న జరిగాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన హన్సిక హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్రాన్ని కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.


