TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీలో రేషన్ షాపులు పునః ప్రారంభం.. సరకులు పంపిణీ చేసిన మంత్రులు

Published on: Sun Jun 1, 2025 12:47PM

 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మళ్లీ  రేషన్ షాపులు తెరుచుకున్నాయి. 29,796 రేషన్‌ దుకాణాల్లో సరకులు పంపిణీ చేస్తున్నారు.  కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు చౌకధరల దుకాణాల్లో వీటిని అందజేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ రేషన్‌ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరకులు అందజేశారు. 

కర్నూలులో మంత్రి టీజీ భరత్‌, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్‌ పంపిణీని ప్రారంభించారు.   ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయి. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు అందిస్తామ సివిల్ సప్లై అధికారులు తెలిపారు. 1 కోటి 46 లక్షల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు నిరాటంకంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రతీ నెలా దాదాపు 16 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఇంటికే రేషన్ సరుకులు అందించే ఏర్పాటు చేశారు.