ఎన్నికల బరిలో రసమయి బాలకృష్ణ
Published on: Wed May 9, 2012 10:04AM
తెలంగాణా ప్రాంతానికి చెందిన విప్లవగాయకుడు రసమయి బాలకృష్ణ పరకాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే పరకాల ఉప ఎన్నికల్లో టి.ఆర్.ఎస్. కు గట్టి పోటీ ఎదురుకావటం ఖాయం. తెలంగాణా ధూమ్ ధామ్ కమిటీ చైర్మన్ అయిన రసమయి బాలకృష్ణ గతంలో టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖర రావును తీవ్రంగా ద్వేశించారు. ఆయనను దూషిస్తూ పాటలు కూడా పాడారు. అటువంటి వ్యక్తికీ బిజెపి టిక్కెట్టు ఇవ్వాలను కోవటం టి.ఆర్.ఎస్. శ్రేణులకు మింగుడుపడటం లేదు. పరకాల నియోజకవర్గం జనరల్ కేటగిరీకి చెందినదైనప్పటికీ ఇక్కడ బిసీ ఓటర్లదే డామినేషన్ దీనిని దృష్టిలో ఉంచుకుని వెనుక బడిన తరగతులకు చెందిన రసమయి బాలకృష్ణకు టిక్కెట్టు ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. రసమయి బాలకృష్ణ మెదక్ జిల్లా సిద్దిపేట వాసి. అయినప్పటికీ, తెలంగాణా అంతటా ఆయనకున్న ప్రజాదరణ దృష్ట్యా టిక్కెట్టు ఇవ్వాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలిసింది.


