జూబిలీహిల్స్‌లో విద్యార్థినిపై అత్యాచారయత్నం
Published on: Sat Jun 7, 2014 11:25AM

హైదరాబాద్‌లోని జూబిలీహిల్స్‌లో ఒక వైద్య విద్యార్థినిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నం చేశాడు. బెంగుళూరుకు చెందిన విద్యార్థిని వైద్యవిద్యకు సంబంధించిన పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కి వచ్చారు. ఆమె హాస్టల్‌లో వున్న సమయంలో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన యువకుడు ఆమె మీద అత్యాచారయత్నం చేశాడు. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే స్పందించి సదరు కామాంధుడిని అరెస్టు చేసినట్టు తెలిసింది. ఈ సంఘటనకి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి వుంది.


