ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకుని.. థియేటర్లో అత్యాచారం

ఫేస్‌బుక్ ద్వారా గాలం వేసి అమాయక యువతుల జీవితాలను నాశనం చేస్తోన్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతునే ఉన్నాయి. ప్రతినిత్యం ఆయా సంఘటనలను చూసైనా సరే అమ్మాయిలు మారడం లేదు. తాజాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయిని మాయ మాటలతో నమ్మించి సినిమాకు తీసుకెళ్లి.. హాల్‌లోనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు.

 

జనగామ జిల్లాకు చెందిన భిక్షపతి అనే యువకుడికి, సికింద్రాబాద్‌కు చెందిన యువతితతో రెండు నెలల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇద్దరు ఛాటింగ్ చేసుకునేవారు.. ఇది హద్దులు దాటి ఫోన్‌లో మాట్లాడుకునే వరకు వెళ్లింది. ఒకసారి హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వచ్చిన భిక్షపతి సదరు యువతిని కలుసుకునేవాడు. అలా గత నెల 29వ తేదీన మరోమారు ఇద్దరు కలిసి ఇందిరాపార్క్‌కు వెళ్లి.. మధ్యాహ్నం సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్‌లో పద్మావతి సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో ప్రేక్షకులు తక్కువగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన భిక్షపతి సినిమా నడుస్తోన్న సమయంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.