ఎంతవారుకాని..
Published on: Tue Sep 4, 2012 4:21PM
సినిమా హీరోలంటే కుర్రాళ్లకు యమా క్రేజ్.. అభిమాన హీరో ఏ చొక్కావేసుకుంటే ఆ చొక్కా కోనేయాల్సిందే. అభిమాన హీరో ఏ బ్రాండ్ వాడితే ఆ బ్రాండ్ వెంటనే ఒంటిమీదికి రావాల్సిందే. వాళ్లు సిగరెడ్లు తాగితే వీళ్లూ సిగరెట్లు తాగుతారు. వాళ్లేం చేస్తే వీళ్లూ అదే చేస్తారు. అందుకే హీరోలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు హీరోలు తెరమీదమాత్రమే హీరోయిజాన్ని ప్రదర్శిస్తారు. మరికొందరు నేతలు నిజజీవితంలోకూడా అంతే హుందాగా ప్రవర్తిస్తారు. ఓ సినిమా షూటింగ్ కోసం రణబీర్ కపూర్ రాజస్థాన్ కెళ్లాడు. పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగాడు. ఓ పర్యావరణ ప్రేమికుడు దీనిపై కోర్టులో కేసేశాడు. తప్పొప్పుకున్న రణబీర్ రెండొందల రూపాయల జరిమానా కూడా కట్టాడు. ఇలాంటి పెద్దపెద్ద హీరోలకు జరిమానాలు విధించేటప్పుడు కాస్త భారీగానే వడ్డించి ఆ డబ్బుల్ని లోకల్ డెవలప్ మెంట్ కోసం వినియోగిస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనకూడా ఈ మధ్య చాలామందిక్కలుగుతోంది.


