అమెరికా బెదరింపులు బేఖాతరు చేసిన ఇరాన్.. పశ్చిమాసియాలో పెచ్చరిల్లిన టెన్షన్
Published on: Tue Apr 7, 2026 12:15PM
.webp)
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. 45 రోజుల పాటు దాడులు ఆపి శాంతిని నెలకొల్పాలన్న అమెరికా విజ్ఞప్తిని టెహ్రాన్ తోసిపుచ్చడంతో, యుద్ధం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తున్నది.
హార్మూజ్ జలసంధి మీదుగా జరుగుతున్న రవాణాకు ఆటంకం కలిగించవద్దని, ఒకవేళ దాడులు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే.. ఈ బెదిరింపులను ఇసుమంతైనా ఖాతరు చేయడం లేదు. పైపెచ్చు ట్రంప్ పై సామాజిక మాధ్యమం వేదికగా మీమ్స్, సెటైర్లు గుప్పించింది.
ముఖ్యంగా హార్మూజ్ జలసంధి నుంచి క్షేమంగా బయటపడటానికి ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇరాన్ సైన్యం రణక్షేత్రంలో అమెరికా దళాలతో తలపడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇరాన్ కీలక ఇంధన వనరులపై అమెరికా గురిపెట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


