TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబారాందేవ్ కు సుప్రీం చివాట్లు

Published on: Thu Feb 23, 2012 1:37PM

న్యూఢిల్లీ: రాంలీలా మైదానంలో గతేడాది జూన్‌లో నిర్వహించిన ఆందోళన సందర్భంగా అర్థరాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై బాబా రాందేవ్, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు చివాట్లు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు దీన్ని నివారించివుండాల్సిందని అభిప్రాయపడింది. పోలీసులకు ప్రజల హక్కులను కాలరాసే అధికారం లేదని పేర్కొంది. నిద్రిస్తున్న వారిపై పోలీసులు దాడికి పాల్పడ్డారంది. హింసకు పాల్పడిన పోలీసులు, రాందేవ్ అనుచరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. ఈ ఘటనలో మృతి చెందిన రాజ్‌బాలా అనే మహిళకు రూ. 5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.