TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆమెపై క్రిమినల్ కేసుకు వర్మ సిద్ధం

Published on: Mon Nov 11, 2013 9:57AM

 

వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "సత్య-2". ఈ చిత్రం దేశవ్యాప్తంగా రిలీజైంది. అయితే తెలుగు వెర్షన్‌ విడుదల మాత్రం కొన్నిచోట్ల ఆలస్యమయ్యింది. దీనికి కారణం హైదరాబాద్ సెన్సార్ బోర్డ్ రీజినల్ ఆఫీసర్ ధనలక్ష్మి అహంకారపూరిత వైఖరియే అని అంటున్నాడు వర్మ. తన సినిమాలోని కొన్ని సీన్స్ కత్తెరలు పడటంతో... ఇదేంటని ప్రశ్నించినందుకు తనని "షటప్ యువర్ మౌత్'' అని అసభ్యకరంగా ఆమె మాట్లాడారని వర్మ అంటున్నాడు. ఈ విషయంలో ఊరుకునేది లేదని, అవసరమైతే ఆమెపై క్రిమినల్ కేసు పెట్టడానికి కూడా వెనకాడనని వర్మ అంటున్నాడు.

 

నిజానికి ధనలక్ష్మి గురించి ఇలాంటి ఆరోపణలు ఈ మధ్య చాలా వస్తున్నాయి. కానీ ఎవ్వరు కూడా ఏం చెయ్యలేకపోతున్నారు. ఇటీవలే మంచు విష్ణు నటించిన "దూసుకెళ్తా" సినిమా సెన్సార్ సమయంలో కూడా ఆ చిత్రం దర్శక, నిర్మాతలను ముప్పుతిప్పలు పెట్టిందట. ఈ విషయంపై హీరో విష్ణు కూడా తన ఆవేదనని వ్యక్తం చేశాడు. మరి ధనలక్ష్మి విషయంపై వర్మ ఇంకెంత దూరం వెళ్తాడో త్వరలోనే తెలియనుంది.