పవన్ కోసం వర్మ, అతని కూతురు ఫైట్...

 

ఇన్ని రోజులు వాళ్ల మీద.. వీళ్ల మీద పడిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ఏకంగా సొంత కూతురు రేవతి వర్మతోనే మాటల యుద్దానికి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు వర్మ పిచ్చి పోస్టులకు ఏమాత్రం స్పందించని ఆయన కూతురు.. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు పేరుపై స్పందించింది. మరి పవన్ కళ్యాణ్ కొడుకు పేరేంటి...దానిపై వర్మకు రేవతి వర్మకు మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలియాలంటే అసలు మేటర్ లోకి వెళ్లాల్సిందే. ఇటీవల పవన్ కు నాలుగో కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే కదా. ఆ బిడ్డకు 'మార్క్ శంకర్ పవనోవిచ్' అనే పేరు పెట్టాడు. ఈ పేరుపై స్పందించిన వర్మ...  ఈ పేరుకు, చరిత్రకు సంబంధాన్ని తెలుపుతూ, ఈ నేమ్ అతి గొప్పదని పోస్ట్ చేశాడు. ఇక దానికి గాను.. ఆయన కుమార్తె రేవతి వర్మ ఈ పోస్టులో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని.. ఏం పనీలేక ఇలాంటి పోస్టులు పెడుతున్నారని.. చరిత్రకు, ఈ పేరుకు పొంతన ఎక్కడుందని నిలదీసింది. మరి వర్మ ఊరుకుంటాడా.. కూతురు అని కూడా చూడకుండా కౌంటర్ ఇచ్చేశాడు. నీకసలు అర్థం చేసుకోవడం రానే రాదన్న విషయం... నువ్వు రాసిన కామెంట్ చూస్తేనే అర్థం అవుతోందని అక్షింతలు వేశాడు. మీ అందరికంటే పవన్ కల్యాణ్ ను తాను ఎక్కువగా ప్రేమిస్తున్నానని, తాను ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించలేరని చెప్పాడు. మొత్తానికి దీనిబట్టి చూస్తుంటే వర్మకు సెటైర్లు వేయడానికి తన, పర అనే బేధం అనేది లేదని అర్ధమవుతోంది. మరి దీనికి ఇక్కడితో బ్రేక్ పడుతుందా... ఇంకా కంటిన్యూ అవుతుందా..? చూద్దాం ఏం జరుగుతుందో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu