వర్మ కెలికేశాడుగా...

 

అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ ను కాంగ్రెస్ నేత  వీ హనుమంతరావు చించేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే పలు అభ్యంతరాలను మూటగట్టుకోగా.. ఇంకా పలు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ఇంతా జరుగుతుంటే అన్నింటిలో వేలు పెట్టే రాంగోపాల్ వర్మ ఊరుకుంటాడా...? ఈ వ్యవహారంలో కూడా వేలు పెట్టి నేనున్నాను అని మరోసారి గుర్తుచేశాడు. వీహెచ్ పై మామూలుగా కామెంట్లు పెట్టలేదు. ఆ కామెంట్లపై కూడా ఓ లుక్కేద్దాం...

 

వీహెచ్‌ మైండ్‌ సెట్‌ పురాతన కాలంలో ఉండిపోయిందని..హనుమంతరావు అర్జున్‌ రెడ్డి పోస్టర్‌ను ఎందుకు చించేశారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. బహుశా.. అంత అందమైన అమ్మాయి.. విజయ్‌ దేవరకొండకు ముద్దివ్వడం ఆయనకు రుచించకపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీహెచ్‌కు అలాంటి అందమైన ఎప్పుడూ ఇలా ముద్దు ఇవ్వాలేదా? అని ప్రశ్నించారు. అంతేకాదు... అర్జున్‌ రెడ్డి పోస్టర్‌ చించేసిన హనుమంతరావు బట్టలను చించేయాలని హీరో విజయ్‌ దేవరకొండకు ఉచిత సలహా కూడా ఇచ్చారు. 'తాతయ్యా..! అర్జున్‌ రెడ్డి సినిమా మీ తాతయ్యల కోసం కాదు. మీ మనవళ్లు మనవరాళ్ల కోసం అని అర్థం చేసుకోండి.' అని వర్మ పోస్టులు పెట్టాడు. మరి ఇన్ని మాటలు అన్న తరువాత వీ హెచ్ ఊరుకుంటాడా... వర్మకు రివర్స్ కౌంటర్ తప్పక ఇస్తాడు.. చూద్దాం..మరి ఎలా రియాక్ట్ అవుతాడో...