గంగోత్రిలో ఇరుక్కుపోయిన రామ్‌దేవ్ బాబా

 

ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా నాలుగు వందల మంది విద్యార్థులతో కలసి గంగోత్రి బయల్దేరారు. అయితే హిమాలయ ప్రాంతంలో వర్షాలు బాగా కురుస్తూ వుండటంతో బాబా రామ్ దేవ్ గంగోత్రిలో ఇరుక్కుపోయారు. వర్షాలు బాగా కురుస్తూ వుండటంతోపాటు వర్షాల కారణంగా రోడ్డు కొట్టుకుపోవడంతో బాబా రామ్ దేవ్ యాత్రకి బ్రేక్ పడింది. అయితే ఈ సమయంలో 400 మంది విద్యార్థులతో కలసి గంగోత్రి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని తాము బాబా రామ్ దేవ్‌కి చెప్పినప్పటికీ ఆయన వినకుండా యాత్ర కొనసాగించారని, ఫలితంగా ఇప్పుడు గంగోత్రిలో ఇరుక్కుపోయారని అధికారులు అంటున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా 400 మంది విద్యార్థులలో ఒక్కరికి అపాయం జరిగినా దానికి రామ్ దేవ్ బాబానే కారకుడిగా తాము పరిగణిస్తామని పోలీసుఅధికారులు చెప్పారు. వర్షాల కారణంగా గంగోత్రి, కేదార్‌నాథ్ వెళ్తున్న యాత్రికులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు గంగోత్రి యాత్రను మూడు రోజులపాటు రద్దు చేశారు. అనుకూల వాతావరణం ఏర్పడిన తర్వాతే తిరిగి యాత్రకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.