Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబుపై రాందేవ్ బాబా పొగడ్తలు...
posted on: Jan 30, 2017 2:35PM
.jpg)
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈరోజు నెల్లూరు పర్యటనలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు సమర్థవంతమైన నాయకుడని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయని.. ఏపీలోని అన్ని విభాగాలు సమన్వయంతో చక్కగా పని చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో తమ పతంజలి ఫుఢ్స్ యూనిట్ ను నెలకొల్పుతామని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన కొనియాడారు.






