TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్‌తో రామ్‌చరణ్ కటీఫ్ : ‘పవర్’కి గుడ్ బై?

Published on: Fri Apr 18, 2014 2:24PM

 

చిరంజీవిని ఆయన అభిమానులు ‘మెగాస్టార్’ అని పిలుచుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్‌ని ‘పవర్‌స్టార్’ అని పిలుచుకుంటూ వుంటారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ని ఈ రెండు స్టార్లూ మిక్స్ చేసి ‘మెగా పవర్ స్టార్’ అని పిలుస్తున్నారు. చిరంజీవి కొడుక్కి పెట్టిన బిరుదులో పవన్ కళ్యాణ్ బిరుదుని ఎందుకు మిక్స్ చేశారో ఆ అభిమానులకి, ఆ దేవుడికే తెలియాలి. తప్పో ఒప్పో రామ్‌చరణ్‌ని ఆయన అభిమానులు ‘మెగా పవర్ స్టార్’ అని పిలుస్తున్నారు. నిన్నటి వరకూ ఈ బిరుదు విని రామ్‌చరణ్ పులకరించిపోయేవాడు. అయితే ఇప్పుడు ఆ బిరుదు వింటేనే రామ్‌చరణ్‌కి చిర్రెత్తుకొస్తున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి చిరంజీవికి వ్యతిరేకంగా రాజకీయ రంగంలో పనిచేయడమే కాకుండా, కుటుంబపరంగా కూడా తమకు చాలా దూరమైపోయిన పవన్ కళ్యాణ్ బిరుదు తన బిరుదులో ఎందుకు వుండాలని రామ్‌చరణ్ భావిస్తున్నట్టు సమాచారం. ఇకపై అభిమానులు తనను ‘మెగా పవర్ స్టార్’ అని సంబోధించవద్దని రామ్ చరణ్ తన అభిమానులకు ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. ఇక ఏ సందర్భంలోనూ తనను ఆ పేరుతో పిలవటాన్ని తాను ఇష్టపడనని రామ్‌చరణ్ ఫ్యాన్స్ కి స్పష్టం చేసినట్టు సమాచారం. అలాగే ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతూ సెట్స్ మీద వున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా టైటిల్స్ లోగానీ, పబ్లిసిటీలోగానీ ‘మెగా పవర్ స్టార్’ అనే అక్షరాలు కనిపించకూడదని నిర్మాతకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది.