TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ కోసం కాళ్లు మొక్కుతాం: పద్మా దేవేందర్

Published on: Wed Jan 11, 2012 10:11AM

హైదరాబాద్: తమ లక్ష్యం కోసం అవసరమైతే ప్రతి ఒక్కరి కాళ్లు మొక్కుతామని రామాయంపేట శాసనసభ్యురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల గుండె చప్పుడుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీమాంధ్ర నేతలకు పాదపూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె ఆన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర సాధన కంటే వ్యక్తిగత పదవులే వారికి ముఖ్యంగా ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఇలాంటి వారు సొంత నియోజకవర్గాల్లో కూడా పోలీసు పహారాలో పర్యటించడం తమకు ఎబ్బెట్టుగా ఉందన్నారు. తెలంగాణలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణ ఉద్యమం బలంగా ఉందన్నారు.