TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నా పొట్ట ఎవరు నింపితే వారికే మద్దతు- రమణ దీక్షితులు

Published on: Fri Jun 8, 2018 10:34AM

 

రమణ దీక్షితులు పేరు ఇప్పుడ తెలుగునాట ప్రతి ఒక్కరికీ పరిచయమే! ఒకప్పుడు తిరుమలలో హై- ప్రొఫైల్‌ అర్చకునిగా దీక్షితులు ఓ వెలుగు వెలిగారు. కానీ ప్రభుత్వం తనతో పదవీ విరమణ చేయించడంతో, పాలకవర్గం మీద పగతో రగిలిపోతున్నారు. ఆ కసితోనే తిరుమలలో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ.. తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి వైకాపా మద్దతు తెలుపుతూ, దీక్షితులు ఆరోపణలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలో దీక్షితులు నిన్న లోటస్‌ పాండ్లో జగన్‌ను కలవడం మరింత చర్చాంశనీయమైంది. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మాట్లాడుతూ ‘నా పొట్ట ఎవరు నింపితే వాళ్లకే మద్దతు ఇస్తాననీ,’ ...’ఎవరు అన్నం పెడితే వాళ్లకు నమస్కారం పెడతాం’ అని చెప్పుకొచ్చారు. అద్భుతమైన క్లారిటీ కదా!