రామ!రామ! ఈ కోటయ్య మళ్లీ మారుతారా?
Published on: Tue Jun 5, 2012 12:15PM
నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ఏది చేసినా వార్తే అయ్యే పరిస్థితి నెలకొంది. సాక్షాత్తూ చంద్రబాబే ఈయన్ని తెలుగుదేశం పార్టీలో ఉండిపొమ్మన్నారు. అక్కడ అలాగేనన్న రామకోటయ్య తాజాగా చిరంజీవిని కలిశారు. దీంతో ఆయన వై.కా.పా. వైపు కాదు కాంగ్రెస్ లో చేరుతానని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. తనకు ఉన్న పాత పరిచయం వల్లే చిరంజీవిని కలిశానని, తాను కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్ ను మాత్రం కలవలేదని రామకోటయ్య స్పష్టం చేశారు. మీరు కాంగ్రెస్ లోకి వచ్చేశారా అన్న ప్రశ్నకు మాత్రం నవ్వుతూ దాటేశారు. అంటే మళ్లీ కోటయ్య తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కు వచ్చేస్తున్నారా? అన్న అనుమానాలకు తావు ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈయనకు షోకాజ్ నోటీసు జారీ చేసే అవకాశాలున్నాయి.


